TG Assembly: ఈ ఎండాకాలంలోనే పనులు ప్రారంభిస్తాం.. తుమ్మడిహట్టిపై మంత్రి ఉత్తమ్ స్టేట్‌మెంట్

by Shiva |   ( Updated:2025-03-17 09:16:33.0  )
TG Assembly: ఈ ఎండాకాలంలోనే పనులు ప్రారంభిస్తాం.. తుమ్మడిహట్టిపై మంత్రి ఉత్తమ్ స్టేట్‌మెంట్
X

దిశ, వెబ్‌డెస్క్: గోదావరి నది ప్రాజెక్టులపై మంత్రి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ (Assembly) సమావేశాల్లో భాగంగా మీడియా పాయింట్ (Media Point) వద్ద ఆయన మాట్లాడుతూ.. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్ట్‌ (Pranahitha-Chevella Project)ను వీలైనంత తొందరలోనే పూర్తి చేస్తామని పేర్కొన్నారు. తుమ్మడిహట్టి (Thummadihatti) దగ్గర ప్రాజెక్ట్ నిర్మాణం చేపడుతామని స్పష్టం చేశారు. ఈ విషయంపై వచ్చే నెలలో మహారాష్ట్ర (Maharashtra)కు వెళ్లి అక్కడి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ (CM Devendra Fadnavis)తో కూడా మాట్లాడుతామని అన్నారు. ఈ ఎండాకాలంలోనే ప్రాజెక్ట్ పనులను ప్రారంభించాలని అనుకుంటున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా సీతారామ ప్రాజెక్ట్‌ (Sitarama Project)కు నీటి కేటాయింపులు త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు. రానున్న రెండేళ్లలో సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేసి నీరందించేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.

పెరిగిన ధాన్యం దిగుబడి..

ఇక గతంతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం దిగుబడి గణనీయంగా పెరిగిందని అన్నారు. ఎన్నడూ లేనివిధంగా రైతులు ఎక్కువ విస్తీర్ణంలో వరి సాగు చేసి అందులోనూ వరి సన్న రకాలు వేయడం సంతోషకరమని అన్నారు. పంట సీజన్ 20 రోజులు పెరగడంతో సాగునీటి సమస్య తలెత్తిందని పేర్కొన్నారు. ఇతర పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ పరంగా ప్రచారం చేసినా.. రైతులు మాత్రం వరి వైపే మొగ్గు చూపించారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.



Next Story

Most Viewed