- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG Assembly: కేటీఆర్‌వి సత్యదూరమైన మాటలు.. మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటర్
అసెంబ్లీలో కేటీఆర్ ఆరోపణలకు మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మహిళా సంక్షేమంపై సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

దిశ, వెబ్‌డెస్క్: నిండు సభలో మహిళా సంక్షేమంపై ప్రతిపక్ష నేత కేటీఆర్ (KTR) ప్రభుత్వంపై సత్యదూరమైన ఆరోపణలు చేస్తున్నారని మంత్రి సీతక్క (Minister Seethakka) మండిపడ్డారు. మంగళవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఆమె సభలో మాట్లాడుతూ.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు.
బీఆర్ఎస్ పదేళ్లలో ఎందుకు చేయలేదు..?
తమ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుందని, బాధ్యత గల ప్రతిపక్షంగా దీనికి సహకరించాలని ఆమె కోరారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలకు రూ. 57 వేల కోట్లకు పైగా రుణాలను మంజూరు చేశామని గణాంకాలతో వివరించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని ప్రతిపక్షాలు ఎగతాళి చేయడం సరికాదని హితవు పలికారు. ‘మేము చేస్తున్న పనులను పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎందుకు చేయలేకపోయింది?’ అని మంత్రి సీతక్క నిలదీశారు. మొదటి నుంచి కేటీఆర్‌కు మహిళలంటేనే చిన్నచూపని, అందుకే ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను జీర్ణించుకోలేక నిప్పులు చెరుగుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.






