TG: రవాణా పత్రాలు పక్కాగా ఉండాలి: ధాన్యం లారీలపై అధికారులు ఫోకస్

by Gantepaka Srikanth |

తెలంగాణ వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు చురుకుగా సాగుతున్న నేపథ్యంలో అవసరమైన లారీలు, ట్రాక్టర్లు అందుబాటులో ఉంచాలని రవాణా శాఖ కమిషనర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

TG: రవాణా పత్రాలు పక్కాగా ఉండాలి: ధాన్యం లారీలపై అధికారులు ఫోకస్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు చురుకుగా సాగుతున్న నేపథ్యంలో అవసరమైన లారీలు, ట్రాక్టర్లు అందుబాటులో ఉంచాలని రవాణా శాఖ కమిషనర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలు కేంద్రాల నుంచి గోదాములు, రైస్ మిల్లులకు ధాన్యం తరలింపుపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. ధాన్యం తరలింపు విషయంలో జిల్లా యంత్రాంగం, పౌర సరఫరాల శాఖతో సమన్వయం చేసుకోవాలని, అవసరాలకు అనుగుణంగా వెంటనే వాహనాలను అందుబాటులో ఉంచాలని తెలిపారు. ధాన్యం తరలించే రవాణా వాహనాలన్నింటికీ చెల్లుబాటు అయ్యే పత్రాలు తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. ఆర్‌సీ, ఫిట్‌నెస్‌, పర్మిట్‌, ఇన్సూరెన్స్‌, పీయూసీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలని పేర్కొన్నారు.

రాష్ట్రంలో పెద్దఎత్తున ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నందున, రవాణా వాహనాల రాకపోకలు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలతో సమన్వయంతో వ్యవహరించాలని రవాణా శాఖ అధికారులకు సూచించారు. రవాణా సమయంలో తలెత్తే సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పారు. రవాణా ఏర్పాట్లపై అధికారుల నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు.

Next Story