- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Dil Raju : ఈరోజు కిమ్స్ ఆసుపత్రికి టీఎఫ్ డీఎస్ చైర్మన్ దిల్ రాజు!
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రి(KIMS Hospital)లో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజను పరామర్శించేందుకు టీఎఫ్ డీఎస్ (TFDC)చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju)ఈరోజు సాయంత్రం ఆసుపత్రికి వెళ్లనున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రి(KIMS Hospital)లో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజను పరామర్శించేందుకు టీఎఫ్ డీఎస్ (TFDC)చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju)ఈరోజు సాయంత్రం ఆసుపత్రికి వెళ్లనున్నారు. శ్రీతేజను పరామర్శించి అతడి కుటుంబ సభ్యులను కలిసి, అండగా ఉంటామని భరోసా ఇవ్వనున్నారు. దిల్ రాజుతో పాటు ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి కూడా కిమ్స్ కు వెలుతారని సమాచారం.
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తల్లి రేవతి మృతి, కొడుకు శ్రీతేజకు తీవ్ర గాయాలవ్వడం.., దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం హీరో అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం సహా చోటుచేసుకున్న వరుస పరిణామాలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. అల్లు అర్జున్ పట్ల ప్రభుత్వ వైఖరితో సినిమా ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య దూరం పెరిగిన నేపథ్యంలో టీఎఫ్ డీఎస్ చైర్మన్ దిల్ రాజు పరిస్థితులను చక్కదిద్దేందుకు ఏం చేయబోతారన్నది ఆసక్తికరంగా మారింది.






