TET Hall Tickets: అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. టెట్ హాల్ టికెట్లు విడుదల

by Kema Shiva Kumar |

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET-2026)కు సంబంధించి ఇవాళ తెలంగాణ పాఠశాల విద్యాశాఖ హాల్ టికెట్లను విడుదల చేసింది.

TET Hall Tickets: అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. టెట్ హాల్ టికెట్లు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET-2026)కు సంబంధించి ఇవాళ తెలంగాణ పాఠశాల విద్యాశాఖ హాల్ టికెట్లను విడుదల చేసింది. ఈ మేరకు పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యా్ప్తంగా టెట్ పరీక్షలు జనవరి 3 నుంచి జనవరి 31 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో రెండు షిఫ్ట్‌లలో జరుగనున్నాయి. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ జర్నల్ నంబర్, పుట్టిన తేదీ వంటి లాగిన్ వివరాలతో హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చిన విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ https://tgtet.aptonline.in/tgtet/‌కు వెళ్లాలని తెలిపారు. అయితే, పరీక్ష కేంద్రంలోకి వెళ్లేవారు వెంట హాల్ టికెట్, ప్రభుత్వం ద్వారి మంజూరు చేసిన ఏదైనా ఫోటో గుర్తింపు కార్డు తీసుకెళ్లాలని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు.

Next Story