స్వతంత్రులను క్యాంప్‌లకు తరలింపు.. జనగామలో హైటెన్షన్

by Gantepaka Srikanth |

జనగామ మున్సిపాలిటీ హంగ్ రావడంతో హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది.

స్వతంత్రులను క్యాంప్‌లకు తరలింపు.. జనగామలో హైటెన్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: జనగామ మున్సిపాలిటీ(Jangaon Municipal Election Results) హంగ్ రావడంతో హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. చైర్మన్ పీఠంపై ఉత్కంఠ కొనసాగుతోంది. కీలక స్వతంత్రులు ఉండటంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు వారిపైనే ఆశలు పెట్టుకున్నారు. 23వ వార్డు అభ్యర్థిని బీఆర్ఎస్ నేతలు క్యాంప్‌నకు తరలిస్తుండగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అడ్డుకున్నారు. అక్కడే ఉన్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి.. ఎంపీ చామలను ప్రశ్నించారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు రెచ్చిపోవడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. మరోవైపు జనగామతో పాటే రాష్ట్రంలో మొత్తం 28కి పైగా మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి స్పష్టమైన ప్యాజిక్ ఫిగర్ దక్కలేదు. దీంతో ఎలాగైనా మున్సిపల్ చైర్మన్ పీఠం కైవసం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు, ఇతర పార్టీ అభ్యర్థులను తమ వైపు తిప్పుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. పలుకోట్ల స్వతంత్ర అభ్యర్థులను క్యాంపులకు తరలించే ప్రయత్నం చేయగా ప్రత్యర్థులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయా మున్సిపాలిటీల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. దీంతో భారీగా మోహరించిన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Next Story