పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు.. ఢిల్లీ తెలంగాణ భవన్‌‌లో పర్యవేక్షణ

by Ramesh Naini |   (  Updated:2026-03-02 15:56:44  IST  )

మధ్యప్రాచ్య (పశ్చిమ ఆసియా) లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ పౌరుల కోసం న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వం 24×7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది.

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు.. ఢిల్లీ తెలంగాణ భవన్‌‌లో పర్యవేక్షణ
X

దిశ, తెలంగాణ బ్యూరో : మధ్యప్రాచ్య (పశ్చిమ ఆసియా) లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ పౌరుల కోసం న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వం 24×7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కొన్ని దేశాల్లో ఏర్పడుతున్న పరిస్థితులను తెలంగాణ ప్రభుత్వం సమగ్రంగా పర్యవేక్షిస్తోందని సమాచార శాఖ కంట్రోల్ రూమ్ అధికారులు సోమవారం వెల్లడించారు. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుంటూ, ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. యుధ్ద ప్రభావిత దేశాల్లో నివసిస్తున్న, చిక్కుకున్న తెలంగాణ పౌరులు, వారి కుటుంబ సభ్యుల నుంచి వస్తున్న సమాచారంతో సహాయం అందించేందుకు కంట్రోల్ రూమ్ సేవలు అందిస్తుందని తెలిపారు. ఇబ్బందులు, ప్రయాణ అంతరాయాలు లేదా అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఈ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చు సూచించారు.

24×7 కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు..

Next Story