- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సర్వత్రా టెన్షన్ వాతావరణం.. BC రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు (Telangana BC Reservations) రిజర్వేషన్ల అంశంపై నేడు హైకోర్టులో(Telangana High Court) విచారణ ప్రారంభమైంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు (Telangana BC Reservations) రిజర్వేషన్ల అంశంపై నేడు హైకోర్టులో (Telangana High Court) విచారణ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే 42 శాతం రిజర్వేషన్లపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించే విషయమై సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) మంగళవారం మంత్రులు, న్యాయ నిపుణులతో చర్చలు జరిపారు. అయితే, వాస్తవానికి ఇవాళ ఉదయం 10.30కి విచారణ ప్రారంభం కావాల్సి ఉండగా.. మొదట న్యాయమూర్తుల ఎదుట బీసీ రిజర్వేషన్ పిటిషన్‌ను న్యాయవాదులు మెన్షన్ చేశారు. దీంతో రిజర్వేషన్ల ప్రస్తుత పరిస్థితి ఏంటని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వారిని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతం పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసిందని, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ కూడా విడుదల అయ్యిందని లాయర్లు బెంచ్‌కు తెలిపారు. సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించిన అంశాన్ని కూడా ప్రస్తావించారు. దీంతో బీసీ రిజర్వేషన్లపై దాఖలైన అన్ని పిటిషన్లపై ఓకేసారి వాదనలు వింటామని హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ స్పష్టం చేసింది.






