వరంగల్-నెక్కొండ హైవేపై ఉద్రిక్తత.. మామునూరు ఎయిర్‌పోర్టు భూ నిర్వాసితుల ఆందోళన

by Kema Shiva Kumar |   (  Updated:2025-03-04 07:08:27  IST  )

మామునూరు ఎయిర్‌పోర్ట్ (Mamunur Airport) అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం (Central Government) ఇప్పటికే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

వరంగల్-నెక్కొండ హైవేపై ఉద్రిక్తత.. మామునూరు ఎయిర్‌పోర్టు భూ నిర్వాసితుల ఆందోళన
X

దిశ, వెబ్‌‌డెస్క్/ఖిలా వరంగల్: మామునూరు ఎయిర్‌పోర్ట్ (Mamunur Airport) అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం (Central Government) ఇప్పటికే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇవాళ సర్వే కోసం వెళ్లిన అధికారులను మామునూరు విమానాశ్రయ భూ నిర్వాసిత రైతులు అడుకున్నారు. అనంతరం ఆర్డీవో సత్యపాల్ (RDO Satyapal), రెవెన్యూ అధికారుల (Revenue Officials)తో వారు వాగ్వాదానికి దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. కానీ, గుంటూరుపల్లె (Gunturupalle), నక్కలపెల్లి గ్రామస్థలుతో పాటు మొత్తం మూడు గ్రామాల ప్రజలు వరంగల్ (Warangal) - నెక్కొండ (Nekkonda) జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. విమానాశ్రయ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. భూ నిర్వాసితులకు సరైన నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎయిర్‌పోర్టు నిర్మాణంలో రెండు మండలాలను కలిపే రోడ్డును తాము కోల్పోతున్నామని, తమకు కొత్త రోడ్డు నిర్మించి, భూములు కోల్పోతున్న రైతులకు మార్కెట్ వాల్యూ ప్రకారం నష్ట పరిహారం చెలించేదాక భూములు ఇవ్వమని అన్నారు. ఇదే విషయమై పరకాల ఎమ్మెల్యేతో మాట్లాడగా.. మీకు రోడ్డు లేదు ఏం లేదంటూ దురుసుగా మాట్లాడారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, తెలంగాణ ప్రభుత్వ (Telangana Government) విజ్ఞప్తి మేరకు మామూనూరు ఎయిర్‌పోర్ట్ (Mamunur Airport) ఆపరేషన్స్‌కి కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు (Union Civil Aviation Minister Rammohan Naidu) ఇటీవలే ఉత్తర్వులు జారీ చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ (Shamshabad Airport) నుంచి 150 కి.మీ పరిధిలో మరో ఎయిర్‌పోర్ట్ ఉండకూడదని గతంలో జీఎంఆర్‌ (GMR) సంస్థతో ఒప్పందం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు (Union Minister Ram Mohan Naidu) జీఎంఆర్‌తో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థన మేరకు జీఎంఆర్‌ (GMR) కూడా ఓకే చెప్పింది. ఈ క్రమంలోనే మామునూరు ఎయిర్‌పోర్ట్​పనులు చేపట్టేందుకు పౌర విమానయాన శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్‌పోర్టు ప్రతిపాదిత స్థలంలో అధికారులను సర్వే చేపట్టాలని ఆదేశించింది.

Next Story