- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MLC counting: కరీంనగర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ సెంటర్ దగ్గర ఉద్రిక్తత.. రీ పోలింగ్ కు డిమాండ్
కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ సంఖ్యలో చెల్లని ఓట్లు నమోదు కావడం పై అభ్యర్థులు ఆందోళనకు దిగారు.

దిశ బ్యూరో కరీంనగర్/ డైనమిక్ బ్యూరో: కరీంనగర్ -మెదక్- నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎన్నిక (Karimnagar Graduate MLC) కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రాడ్యూయేట్ ఎన్నికల్లో ఇప్పటి వరకు దాదాపు 70 వేలకు పైగా చెల్లని ఓట్లు నమోదు కావడంతో కౌంటింగ్ సెంటర్ (Counting center) వద్ద ఇండిపెండెంట్ అభ్యర్థులు (Independent Candidates) ఆందోళనకు దిగారు. చాలా మంది కొత్త ఓటర్లకు ఎన్నికల అధికారులు సరైన అవగాహన కల్పించకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే పెద్దఎత్తున చెల్లని ఓట్లు నమోదు అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ఎన్నికల కమిషన్ బాధ్యత వహిస్తూ రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇక ఇవే జిల్లాల్లో జరిగిన టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి కౌంటింగ్ కొనసాగుతున్నది. ఈ స్థానానికి మొత్తం పోల్ అయిన ఓట్లు 25,032 ఓట్లు కాగా ఇందులో 821 చెల్లని ఓట్లుగా అధికారులు తేల్చారు. మిగతా ఓట్ల లెక్కింపు ఈ రోజు రాత్రి 12 గంటల వరకు పూర్తయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున చెల్లని ఓట్లు నమోదు కావడంపై సోషల్ మీడియాతో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పిల్లలకు చదువులు చెప్పాల్సిన టీచర్లు, ఉన్నత చదువులు చదివిన పట్టభద్రులకు ఓటు వేయరాకపోవడం ఏంటనే విమర్శలు వినిపిస్తున్నాయి.
14 మంది ఎలిమినేట్:
నల్గొండ-వరంగల్- ఖమ్మం స్థానానికి జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ కౌటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది. 15వ రౌండ్ పూర్తయ్యేసరికి 14 మంది అభ్యర్థులకు కేవలం సున్నా ఓట్లు నమోదయ్యాయి. దీంతో ఈ 14 మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేసినట్లు ఎన్నికల అధికారి వెల్లడించారు.






