- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
T BJP: రామచందర్ రావు ఎదుటే ఎంపీ డీకే అరుణ వర్సెస్ శాంతకుమార్ వర్గీయుల బాహాబాహీ
రామచందర్ రావు మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ బీజేపీలో (Telangana BJP) అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. కొత్త స్టేట్ చీఫ్ నియామకంతో నేతలంతా సఖ్యతతో ఉంటారని అంతా భావించినా క్షేత్రస్థాయిలో పరిస్థితులు పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నాయి. తాజాగా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు (Ramchander Rao) ఎదుటే ఎంపీ డీకే అరుణ (DK Aruna), పార్టీ సీనియర్ నేత శాంతకుమార్ (Shantha Kumar) వర్గీయులు బాహాబాహీకి దిగడం దుమారం రేపింది. ఇవాళ రామచందర్ రావు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో అందరి ఎదుటే ఇరువర్గాలు గొడవకు దిగాయి. శాంత కుమార్ ఎంపీ ఎన్నికల్లో డీకే అరుణకు సపోర్టు చేయలేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత కొంత కాలంగా ఇరువురు నేతల మధ్య గ్యాప్ పెరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఇద్దరి మధ్య నివురుగప్పిన నిప్పులా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో స్టేట్ చీఫ్ పర్యటన సందర్భంగా చాలా రోజుల తర్వాత డీకే అరుణ, శాంత కుమార్ ఇద్దరు ఒకే వేదిక పంచుకున్నారు. ఈ సమయంలో గో బ్యాంక్ శాంత కుమార్ అని డీకే అరుణ అనుచరులు నినాదాలు చేయడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.
కాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచందర్ రావు నియామకం తర్వాత తెలంగాణ బీజేపీలో పరిస్థితులు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. రామచందర్ రావు నియామకంపై అసంతృప్తితో ఎమ్మెల్యే రాజాసింగ్ ఏకంగా పార్టీకి గుడ్ బై చెప్పగా ఇటీవల ఈటల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ మధ్య ఆధిపత్య పోరు కమలం పార్టీని టెన్షన్ పెట్టిస్తోంది. మిగతా చోట్ల కూడా నేతల మధ్య అధిపత్య పోరు సాగుతోందని వీటిని కంట్రోల్ చేయాల్సిన కొత్త అధ్యక్షుడు విఫలం అవుతున్నాడనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల వేళ నేతల మధ్య ఈ తరహా విభేదాలు పార్టీకి నష్టం చేస్తాయనే ఆవేదన పార్టీ క్యాడర్ లో వినిపిస్తోంది.






