ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత

by samatah |   (  Updated:2023-06-07 14:58:16  IST  )

తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బుధవారం ఇంటర్ బోర్డు ముట్టడికి ఏబీవీపీ నేతలు యత్నించారు. ప్రైవేటు కాలేజీలో ఫీజులు నియంత్రించాలని ఏబీవపీ నేతలు డిమాండ్ చేస్తూ ఇంటర్ బోర్డు కార్యాలయం

ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బుధవారం ఇంటర్ బోర్డు ముట్టడికి ఏబీవీపీ నేతలు యత్నించారు. ప్రైవేటు కాలేజీలో ఫీజులు నియంత్రించాలని ఏబీవపీ నేతలు డిమాండ్ చేస్తూ ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఇంటర్ బోర్డు కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లిన నేతలను పోలీసులు అడ్డుకోగా వాగ్వాదం నెలకొంది. అనంతరం ఆందోళణ చేస్తున్న ఏబీవీపీ నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.

Next Story