హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద ఉద్రిక్తత

by Ajay Maddhiboyina |

సినిమా థియేట‌ర్ల‌లో ధ‌ర‌లు త‌గ్గించాలి అంటూ హైద‌రాబాద్ లోని సంధ్య థియేట‌ర్ వ‌ద్ద పీవైఎల్ అనే సంఘం కార్య‌క‌ర్త‌లు సంత‌కాల సేక‌ర‌ణ కార్య‌క‌మం నిర్వ‌హించారు. సినిమాకు వ‌చ్చిన ప్రేక్ష‌కులు త‌మ అభిప్రాయాలు తెలుపుతూ సంతాకాలు చేయాల‌న్నారు.

హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద ఉద్రిక్తత
X

దిశ‌, వెబ్ డెస్క్: సినిమా థియేట‌ర్ల‌లో ధ‌ర‌లు త‌గ్గించాలి అంటూ హైద‌రాబాద్ లోని సంధ్య థియేట‌ర్ వ‌ద్ద పీవైఎల్ అనే సంఘం కార్య‌క‌ర్త‌లు సంత‌కాల సేక‌ర‌ణ కార్య‌క‌మం నిర్వ‌హించారు. సినిమాకు వ‌చ్చిన ప్రేక్ష‌కులు త‌మ అభిప్రాయాలు తెలుపుతూ సంతాకాలు చేయాల‌న్నారు. థియేట‌ర్ ముందు ఓ బోర్డు పెట్టి సంతాకాలు సేక‌రించ‌గా థియేట‌ర్ సిబ్బంది వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో టికెట్, స్నాక్స్, పార్కింగ్ టికెట్ ధ‌ర‌లు త‌గ్గింలంటూ పీవైఎల్ కార్య‌క‌ర్త‌లు డిమాండ్ చేశారు. ప్ర‌తిఒక్క‌రూ త‌మ‌కు మ‌ద్ద‌తు తెల‌పాల‌ని ఉద్యమం చేస్తేనే టికెట్ ధ‌ర‌లు త‌గ్గుతాయ‌ని అన్నారు.

ఈ క్ర‌మంలో కాసేపు థియేట‌ర్ వ‌ద్ద ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. థియేటర్ వ‌ద్ద ఆందోళ‌న చేయ‌వ‌ద్ద‌ని కావాలంటే కేసులు పెట్టుకోవాల‌ని సిబ్బంది ఆందోళ‌న‌కారులను అక్క‌డ నుండి పంపించే ప్ర‌య‌త్నం చేశారు. ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం టికెట్ ధ‌ర‌లు భారీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. బాల్క‌నీ టికెట్ ధ‌ర కొన్ని థియేట‌ర్ల‌లో 200పైగానే ఉంది. డ్రెస్ స‌ర్కిల్ టికెట్ ధ‌ర‌లు రూ.150పైగానే ఉన్నాయి. మ‌రోవైపు బ‌య‌ట స‌మోసా రూ.20 ఉంటే థియేట‌ర్ల‌లో రూ.50కి అమ్ముతున్నారు. దీంతో సామాన్యుల జేబుల‌కు చిల్లు ప‌డుతోంది. ఈక్ర‌మంలోనే చాలా కాలంగా ధ‌ర‌లు త‌గ్గించాల‌నే డిమాండ్ వినిపిస్తోంది.

Next Story