- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిల్‌కుషా గెస్ట్‌హౌస్ వద్ద ఉద్రిక్తత.. ప్లకార్డులతో BJP కార్యకర్తల నిరసన
ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఇవాళ సిట్ విచారణకు హాజరుకాబోతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఇవాళ సిట్ విచారణకు హాజరుకాబోతున్నారు. వాస్తవానికి సిట్ అధికారులు బండిని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిట్ కార్యాలయంలో విచారించాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం ఆయన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా కొనసాగుతుండటంతో ప్రోటోకాల్ అడ్డొచ్చింది. దీంతో రాజ్‌భవన్ పక్కనే ఉన్న (Dilkusha Guest House)లో బండి సంజయ్‌ని అధికారులు విచారించి ఆయన ఇచ్చే స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నారు.
ఈ నేపథ్యంలోనే బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున రాజ్‌భవన్ రోడ్డులోని దిల్‌కుషా అతిథి గృహానికి చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)తో విచారణ జరిపించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. విచారణల పేరుతో కాంగ్రెస్ సర్కార్ కేసులో కాలం వెళ్లదీస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) పార్టీలు కుమ్మక్కై బీజేపీని ప్రతిష్టను దెబ్బతీసేందుకు కంకణం కట్టుకున్నాయని పలువురు బీజేపీ నేతలు ఆరోపించారు. దిల్‌కుషా గెస్ట్ హౌస్‌కు బండి సంజయ్ రానుండటంతో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.






