- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Group-1: సెంట్రల్ లైబ్రరీ వద్ద ఉద్రిక్తత.. గేటు వద్దే కవితను అడ్డుకున్న పోలీసులు
హైదరాబాద్ చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. గ్రూప్-1 అభ్యర్థులు, నిరుద్యోగులతో మాట్లాడేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత లైబ్రరీ వద్దకు వచ్చారు. కవితతో పాటు భారీగా జాగృతి కార్యకర్తలు తరలి వచ్చారు. అయితే సెంట్రల్ లైబ్రరీలోకి వెళ్లకుండా కవితను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ పోలీసులకు కవిత అనుచరులు, నిరుద్యోగులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత కాసేపటికి పోలీసులు కవితను లోపలికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. సిటీ సెంట్రల్ లైబ్రరీ ఆవరణంలో కింద కూర్చుని నిరుద్యోగులతో కవిత మాట్లాడారు.
Next Story






