పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో టెన్షన్.. నేడు అనర్హత పిటిషన్లపై సుప్రీం తుది తీర్పు

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-31 02:41:44  IST  )

బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ

పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో టెన్షన్.. నేడు అనర్హత పిటిషన్లపై సుప్రీం తుది తీర్పు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ (BRS) పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌ (Congress)లో చేరిన పది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ (Assembly) స్పీకర్‌ వెంటనే నిర్ణయం తీసుకొనేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (KTR), ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీవివేకానంద, జగదీశ్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, చింతా ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్, బీజేపీ శాసనాసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాల తుది తీర్పును వెలువరించనుంది. గతేడాది జనవరి 15న దాఖలు చేసిన పిటిషన్లపై ఇప్పటి వరకు జస్టిస్‌ బీఆర్‌ గవాయ్ (Justice BR Gavai), జస్టిస్‌ ఆగస్టీన్‌ జార్జ్‌ మసీహ్‌ (Justice Augustine George Masih) ధర్మాసనం తొమ్మిది సార్లు విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదనలువిన్న కోర్టు ఏప్రిల్‌ 3న తీర్పును రిజర్వు చేసింది. కేసులో ప్రతివాదులుగా అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే, ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పును ఇవ్వబోతోందా అని అన్ని పార్టీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

Next Story