Jubilee Hills result: జూబ్లీహిల్స్ ఫలితం.. 'లోకల్' లీడర్లలో ఉత్కంఠ

by Prasad Jukanti |   (  Updated:2025-11-14 02:09:23  IST  )

మరికాసేపట్లో స్థానిక సంస్థల ఎన్నిక కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది.

Jubilee Hills result: జూబ్లీహిల్స్ ఫలితం.. లోకల్ లీడర్లలో ఉత్కంఠ
X

దిశ,డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు (Jubilee Hills By Poll Counting) మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఈ ఫలితం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులకు వేదికగా మారబోతోందనే రాజకీయ వర్గాల్లో అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయ పార్టీల భవిష్యత్ తలరాతలను ప్రభావితం చేయబోతున్న ఈ బై పోల్ ఫలితంపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయా పార్టీలలోని స్థానిక లీడర్లు సైతం ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ ఉప ఎన్నిక ఫలితం ప్రభావం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలల్లోనూ (Local Body Elections) ఉండే అవకాశం ఉండటంతో జూబ్లీహిల్స్ లో తమ పార్టీనే గెలవాలని అన్ని పార్టీలలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తున్న ఆశావహులంతా ఎదురు చూస్తున్నారు. దీంతో ఎవరి ఆశలు సజీవం కాబోతున్నాయనేది మరికాసేపట్లో తేలనుంది.

Read More..

జూబ్లీహిల్స్‌లో గెలిచేదెవరు..? కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే హోరాహోరీ పోరు

Next Story