- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంపై మరోసారి చలి పంజా.. 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ చలితీవ్రత పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో..

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ చలితీవ్రత పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రతకు ప్రజలు వణుకుతున్నారు. నేడు, రేపు రాష్ట్రంలో చలి అధికంగా ఉంటుందని పేర్కొంటూ.. 13 జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపే నమోదయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. నేడు ఆదిలాబాద్, కొమురం భీం, సంగారెడ్డి, మెదక్, మచిర్యాల, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలలోపే నమోదయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. నిన్న ఆదిలాబాద్ లో అత్యల్పంగా 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
ఇక హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల కనిష్టానికి పడిపోనున్నట్లు తెలిపింది. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని, రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. పిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. మరోసారి రాష్ట్రంలో చలితీవ్రత పెరిగిన నేపథ్యంలో బయటకు రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. ఈ చలికాలానికి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందోనని ఎదురుచూస్తున్నారు. కాగా.. డిసెంబర్ 31తో చలితీవ్రత తగ్గుతుందని తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీ అంచనా వేశారు. జనవరి నుంచి సాధారణ చలికాలం ఉంటుందని, నాలుగో వారంలో వర్షాలు పడే ఛాన్స్ కూడా ఉందన్నారు.






