TG: రోళ్లు పగిలేంత ఎండలు.. జనం విలవిల

by Gantepaka Srikanth |

రాష్ట్రంలో ఎండలు నిప్పులు కురిపిస్తున్నాయి. వడగాల్పుల తీవ్రతకు జనం విలవిలలాడుతున్నారు.

TG: రోళ్లు పగిలేంత ఎండలు.. జనం విలవిల
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఎండలు నిప్పులు కురిపిస్తున్నాయి. వడగాల్పుల తీవ్రతకు జనం విలవిలలాడుతున్నారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం, రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నిజామాబాద్ జిల్లా మెండోరలో అత్యధికంగా 46 డిగ్రీలుగా నమోదై రికార్డు సృష్టించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. ప్రధానంగా నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.




Next Story