నిప్పుల కొలిమిలా తెలంగాణ.. ఆ జిల్లాలకు 'ఆరెంజ్ అలర్ట్' జారీ!

by Gantepaka Srikanth |

రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. గడిచిన రెండు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడంతో జనం విలవిలలాడుతున్నారు.

నిప్పుల కొలిమిలా తెలంగాణ.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. గడిచిన రెండు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడంతో జనం విలవిలలాడుతున్నారు. ఏప్రిల్ రెండో వారంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపుతుండటంతో వేడి గాలులు తీవ్రత పెరిగింది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఇప్పటికే 40 డిగ్రీల మార్కును దాటేశాయి. రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న ఎండ తీవ్రతను దృష్ట్యా హైదరాబాద్ వాతావరణ కేంద్రం పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, కొన్ని చోట్ల గరిష్టంగా 41 డిగ్రీ సెల్సియస్ నుండి 44 డిగ్రీ సెల్సియస్ వరకు నమోదయ్యే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

జిల్లాల్లో భీభత్సం..

రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం మరియు మహబూబ్ నగర్ వంటి జిల్లాల్లో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఉదయం 10 గంటల నుంచే బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. గత 48 గంటల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. తీవ్రమైన ఎండల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు. వృద్ధులు, చిన్న పిల్లలు మరియు గర్భిణీలు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉండటానికి తగినంత నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలి.




Next Story