అమెరికాలో స్విమ్మింగ్ పూల్‌లో మునిగి తెలుగు యువతి మృతి

by Ajay Maddhiboyina |

అమెరికాలో తెలుగు విద్యార్థి స్విమ్మింగ్ పూల్ లో మునిగి మృతి చెందిన ఘ‌ట‌న చోటు చేసుకుంది. వ‌ర్జీనియాలో నివాసం ఉంటున్న వీణ అనే యువ‌తి రెండు రోజుల క్రితం ఫ్లోరిడాలో జ‌రిగిన ఓ ఫంక్ష‌న్‌కు వెళ్లింది.

అమెరికాలో స్విమ్మింగ్ పూల్‌లో మునిగి తెలుగు యువతి మృతి
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికాలో తెలుగు విద్యార్థి స్విమ్మింగ్ పూల్ లో మునిగి మృతి చెందిన ఘ‌ట‌న చోటు చేసుకుంది. వ‌ర్జీనియాలో నివాసం ఉంటున్న వీణ అనే యువ‌తి రెండు రోజుల క్రితం ఫ్లోరిడాలో జ‌రిగిన ఓ ఫంక్ష‌న్‌కు వెళ్లింది. అక్కడ స్విమ్మింగ్ చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకోవడంతో దుర్మరణం పాలైంది. వీణ తల్లిదండ్రులు దేవేందర్ రెడ్డి, సునీత ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని లింగోజిగూడ డివిజన్ లో నివాసం ఉంటున్నారు. విషయం తెలియడంతో బాధిత కుటుంబ సభ్యులను ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి పరామర్శించారు. వీణ మృత‌దేహాన్ని వీలైనంత త్వ‌ర‌గా భార‌త్ కు తీసుకువచ్చేందుక స‌హ‌కారం అందిస్తామ‌ని హామీ ఇచ్చారు. ఇక ఇటీవల కూడా ఏపీకి చెందిన ఓ విద్యార్థి అమెరికాలో స్విమ్మింగ్ పూల్ లో మునిగి మరణించాడు. ఈ ఘటన జరిగిన కొంతకాలనికే మళ్లీ అలాంటి ప్రమాదంలో తెలుగు విద్యార్థిని మృతి చెంద‌డం ఆందోళ‌నక‌రంగా మారింది.

Next Story