- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HCU విద్యార్థులకు తెలుగు హీరోయిన్ మద్దతు
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలి(Gachibowli) రెవెన్యూ సర్వే నం.25లో గల 400 ఎకరాల భూమిపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(Hyderabad Central University) విద్యార్థులు, రాష్ట్ర ప్రభుత్వానికి(Congress Government) మధ్య వివాదం నడుస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలి(Gachibowli) రెవెన్యూ సర్వే నం.25లో గల 400 ఎకరాల భూమిపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(Hyderabad Central University) విద్యార్థులు, రాష్ట్ర ప్రభుత్వానికి(Congress Government) మధ్య వివాదం నడుస్తోంది. ఆ భూమిలోని చెట్ల నరికివేతను ఆపాలని.. వేలం వేయడాన్ని ఆపాలని హెచ్‌సీయూ(HCU) విద్యార్థులు ఆందోళనకు దిగారు. మరోవైపు.. ఈ భూములకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతో ఎటువంటి సంబంధం లేదని, ముమ్మాటికీ ఆ భూములు ప్రభుత్వానికే చెందుతాయని దేశసర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు(Supreme Court) తేల్చి చెప్పిన అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తుతోంది.
అయితే, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు చేస్తున్న పోరాటానికి ఇప్పటివరకు బీఆర్ఎస్, బీజేపీ నేతలు మద్దతు ఇవ్వగా.. తాజాగా సినీ ఇండస్ట్రీ నుంచి కూడా విద్యార్థులకు మద్దతు లభిస్తోంది. సోషల్ మీడియా వేదికగా విద్యార్థుల ఆందోళనకు మద్దతిస్తున్నట్లు తెలుగు(Tollywood) హీరోయిన్ ఈషా రెబ్బా(Eesha Rebba) పోస్టు పెట్టారు. దీంతో మీ ధైర్యానికి హ్యాట్సాఫ్ మేడం అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.






