- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా కొడుకు ఆచూకీ చెప్పండి.. బయ్యా సన్నీయాదవ్ తండ్రి ఆవేదన
ప్రముఖ తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ (Bayya Sunny Yadav)ను గురువారం ఎన్‌ఐఏ (NIA) అధికారులు అరెస్ట్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ (Bayya Sunny Yadav)ను గురువారం ఎన్‌ఐఏ (NIA) అధికారులు అరెస్ట్ చేశారు. అయితే, ఇటీవలే పాకిస్తాన్ (Pakistan) టూర్‌ను ముగించుకుని స్వదేశానికి వచ్చిన సన్నీయాదవ్‌ను చెన్నై (Chennai) ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకుని ఢిల్లీ (Delhi)లోని ఎన్ఐఏ ప్రధాన కార్యాలయానికి తరలించినట్లుగా తెలుస్తోంది. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్‌కు గూఢచారిగా వ్యవహరించిందనే అనుమానంతో ఆమెను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే NIA అధికారుల దృష్టి భయ్యా సన్నీయాదవ్‌పై పడింది. వారి ఆదేశాల మేరకు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సన్నీ స్వగ్రామైన సూర్యాపేట (Suryapet) జిల్లా నూతనకల్ మండల కేంద్రానికి వెళ్లి ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. అయితే, సన్నీయాదవ్ పాకిస్తాన్‌లో అకామిడేషన్ ఇచ్చింది ఎవరు.. ఎన్ని రోజులు అక్కడ ఉన్నాడు.. ఏం చేశాడని ఎన్ఐఏ అధికారులు సన్నీయాదవ్‌ను విచారించబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఈ క్రమంలోనే బయ్యా సన్నీయాదవ్ అకస్మాత్తుగా కనిపించకుండాపోవడంపై ఆయన తండ్రి రవీందర్ (Ravinder) స్పందించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన కుమారుడికి ఉగ్రవాదులతో సంబంధాలు లేవని.. తన ఓ గొప్ప దేశభక్తుడని అన్నారు. కేవలం బైక్ రైడర్‌గా అన్ని దేశాలకు వెళ్లినట్లుగానే పాకిస్తాన్ వెళ్లాడిన చెప్పుకొచ్చారు. పహల్గాం టెర్రర్ అటాక్‌కు ముందే ముందే టూర్ పూర్తయ్యిందని పేర్కొన్నారు. తన కుమారుడిని చెన్నై ఎయిర్‌పోర్టులో గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారని ఆరోపించారు. అదేవిధంగా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కూడా తమ ఇంటికి వచ్చి కొన్ని పత్రాలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారని స్పష్టం చేశారు. తన కొడుకు ఆచూకీ తెలపాలంటూ రవీందర్ ఆవేదన వ్యక్తం చేశాడు.
Also Read..






