- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పార్టీలో వారి స్థానం ఏంటో చెప్పండి.. కిషన్‌రెడ్డికి రాజాసింగ్ సూటి ప్రశ్న
రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పడు, ఢిల్లీ నుంచి వచ్చే ప్రముఖ నాయకులు తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పడం తప్ప ఎక్కడ ఆచరణలో చూపలేదని గోషామహల్ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పడు, ఢిల్లీ నుంచి వచ్చే ప్రముఖ నాయకులు తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పడం తప్ప ఎక్కడ ఆచరణలో చూపలేదని గోషామహల్ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. బుధవారం జూబ్లీహిల్స్అభ్యర్ధి ప్రకటన తరువాత కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇదేమి రాజ్యం.. కిషన్రాజ్యమంటూ నినాదాలు చేశారు. తెలంగాణలో ఎన్నికలు వస్తే బీసీలను మరిచిపోతారని, నేడు కమలం పార్టీలో బీసీలు ఎక్కడ ఉన్నారో చెప్పాలని ప్రశ్నించారు. తాను ఎప్పడు బీసీల గురించి మాట్లాడలేదని, హిందూత్వం గురించి వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు. ప్రతి ఎన్నికల్లో బీసీ కార్డును చూపి, బీసీ సమాజాన్ని మోసం చేస్తున్నారని, ఉప ఎన్నికల్లో దీపక్‌రెడ్డికి టికెట్ ఇవ్వడంపై అభినందనలు తెలిపారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారని అక్కడి ప్రజలు తమను అడుగుతున్నారని కామెంట్ చేశారు. బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తారా, కాంగ్రెస్‌ను గెలిపిస్తారా అంటూ సోషల్ మీడియాలో జనాలు ఎద్దేవా చేస్తున్నారని వెల్లడించారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుందని కిషన్‌రెడ్డి గౌరవం ప్రమాదంలో పడుతుందన్నారు.
బీజేపీ కార్యాలయంలో బీసీల నేత మధ్య ఘర్షణ..
రాష్ర్ట బీజేపీ కార్యాలయంలో బీసీ సంఘాల ప్రతినిధుల మధ్య తీవ్ర ఉద్రికత్త చోటుచేసుకుంది. బీసీ బంద్‌కు మద్దతు ఇవ్వాలని అధ్యక్షులు రాంచందర్‌రావు కలిసేందుకు ఎంపీ ఆర్కృష్ణయ్యతో కలిసి వచ్చిన నేతలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. రాంచందర్‌రావు సమక్షంలోనే బీసీ సంఘం నేతలు గుజ్జ కృష్ణ, గుజ్జ సత్యం మధ్య విబేదాలు బయటకు వచ్చాయి. జూనియర్అయి ఉండి ఎలా ఫోటోలకు ముందుకు వెళ్తావని ఒకరిపై ఒకరు కేకలు పెడుతూ చివరకు పరస్పరం దాడికి వెళ్లారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.






