తెలంగాణ తొలి రూరల్ ఏఐ ల్యాబ్‌కు జాతీయ గుర్తింపు

by Gantepaka Srikanth |

తెలంగాణలో తొలి రూరల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ల్యాబ్‌ ఏర్పాటు చేసినందుకు టీ-ఫైబర్ సంస్థకు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది.

తెలంగాణ తొలి రూరల్ ఏఐ ల్యాబ్‌కు జాతీయ గుర్తింపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో తొలి రూరల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ల్యాబ్‌ ఏర్పాటు చేసినందుకు టీ-ఫైబర్ సంస్థకు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. టెక్నాలజీ రంగానికి చెందిన సంస్థ టెక్నాలజీ సభ నిర్వహించిన అవార్డుల్లో ఏఐ కేటగిరీలో టీ-ఫైబర్ ఈ పురస్కారం అందుకుంది. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రకటించారు. టీ-ఫైబర్ సంస్థ తరఫున మేనేజింగ్ డైరెక్టర్ పి.వేణు ప్రసాద్ అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ అంతరాన్ని తగ్గించి, హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీతోపాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు అందించడమే టీ-ఫైబర్ లక్ష్యమని వెల్లడించారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు దూరదృష్టితో రాష్ట్రంలో డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్‌కు టీ-ఫైబర్ కీలక వేదికగా మారిందని పేర్కొన్నారు. రూరల్ ఏఐ ల్యాబ్ ద్వారా గ్రామీణ యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ టెక్నాలజీలపై శిక్షణ అందిస్తూ కొత్త అవకాశాలను సృష్టించడమే లక్ష్యమని టీ-ఫైబర్ ఎండీ తెలిపారు.

Next Story