- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ ఉమెన్ పోలీసింగ్ ‘ది బెస్ట్’.. మిస్ వరల్డ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఉమెన్ పోలీసింగ్ (Women Policing)లో తెలంగాణ ‘ది బెస్ట్’ అని థాయ్‌లాండ్ భామ, మిస్ వరల్డ్ ఓపల్ సుచాత సువాంగ్‌శ్రీ (Opal Suchata Suangsri) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఉమెన్ పోలీసింగ్ (Women Policing)లో తెలంగాణ ‘ది బెస్ట్’ అని థాయ్‌లాండ్ భామ, మిస్ వరల్డ్ ఓపల్ సుచాత సువాంగ్‌శ్రీ (Opal Suchata Suangsri) అన్నారు. ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనేందుకు గత నెల హైదరాబాద్ (Hyderabad) వచ్చిన సుచాత బుధవారం రాత్రి తన స్వదేశానికి వెళ్లిపోయారు. వెళ్లే ముందు ఆమె శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడుతూ.. తాను నగరంలో ల్యాండ్ అయిన నాటి నుంచి తిరిగి స్వదేశానికి వెళ్లేంత వరకు తెలంగాణ ఇచ్చిన అతిథ్యాన్ని జీవితంలో మరులేనని అన్నారు. పోటీల్లో భాగంగా పర్యటనల్లో తనకు చాలా మంది మహిళా పోలీసులే కనిపించారని.. తాము ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా, 24 గంటలు తమను కంటిరెప్పలా కాపాడారని కితాబిచ్చారు. కానీ, తమ దేశం థాయ్‌లాండ్ (Thailand)లో అసలు మహిళా పోలీసులే కనిపించరని కామెంట్ చేశారు. ఇలా ఉమెన్ పోలీసింగ్‌తో సాటి మహిళల్లో ఏదో తెలియని కాన్ఫిడెన్స్, ధైర్యం పెంపొందిస్తుందని మిస్ వరల్డ్ ఓపల్ సుచాత సువాంగ్‌శ్రీ అన్నారు.






