తెలంగాణ వెదర్‌మ్యాన్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం

by Ajay Maddhiboyina |

తెలంగాణ వెదర్ మ్యాన్‌గా సోషల్ మీడియాలో వాతావరణ అప్డేట్స్ ఇచ్చే బాలజీ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ప్రతిష్టాత్మక సుచిర్ ఇండియా, సంకల్ప సంజీవని పురష్కారాన్ని అందుకున్నారు.

తెలంగాణ వెదర్‌మ్యాన్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ వెదర్ మ్యాన్‌గా సోషల్ మీడియాలో వాతావరణ అప్డేట్స్ ఇచ్చే బాలజీ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ప్రతిష్టాత్మక సుచిర్ ఇండియా, సంకల్ప సంజీవని పురష్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా ద్వారా సుచిర్ ఇండియాకు ధన్యవాదాలు తెలిపారు. గత 6 సంవత్సరాలుగా తెలంగాణ వెదర్ మ్యాన్ గా ప్రజలకు సేవలు అందించిన తనకు అవార్డు దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ అవార్డు తనను రైతులకు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలకు మరిన్ని సేవలు అందించడానికి మందుకు నడిపిస్తుందని పేర్కొన్నారు. గత ఆరు సంవత్సరాలుగా అద్భుతమైన మద్ధతు ఇచ్చిన ప్రతిఒక్కరికీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. మీ స‌పోర్ట్ లేకుండా నేను ఈ స్థానానికి వ‌చ్చేవాడిని కాద‌ని, ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాన‌ని పేర్కొన్నారు.

Next Story