సౌరీకరణ దిశగా తెలంగాణ

by Muthe.Rajitha |

దేశపు పునరుత్పాదక ఇంధన లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా, స్వానితి ఇనిపియేటివ్ "భారత సౌరీకరణ ప్రస్థానంలో ప్రజా ప్రతినిధుల పాత్ర" అనే అంశంపై మంగళవారం హైదరాబాదులోని కోరల్ హాల్, కోర్ట్ యార్డ్​మారియట్ లో సమావేశాన్ని నిర్వహించింది.

సౌరీకరణ దిశగా తెలంగాణ
X

దిశ, తెలంగాణ బ్యూరో : దేశపు పునరుత్పాదక ఇంధన లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా, స్వానితి ఇనిపియేటివ్ "భారత సౌరీకరణ ప్రస్థానంలో ప్రజా ప్రతినిధుల పాత్ర" అనే అంశంపై మంగళవారం హైదరాబాదులోని కోరల్ హాల్, కోర్ట్ యార్డ్​మారియట్ లో సమావేశాన్ని నిర్వహించింది. ఇందులో ప్రజా ప్రతినిధులు భారత సౌరశక్తి మార్పును వేగవంతం చేయడంలో ఏమాత్రం కీలకంగా ఉండాలో చర్చించారు. ప్రత్యేకించి రాష్ట్రీయ స్థాయిలో ప్రభుత్వం అమలు చేస్తున్న పునరుత్పాదక ఇంధన పథకాలను సమర్ధవంతంగా ఉపయోగించుకొని, గ్రామీణ ప్రాంతాల ప్రజలను స్వయం సాధికారత దిశగా ప్రోత్సహించడాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రెడ్కో(రెన్వబుల్ ఎనర్జీ డెవలప్​మెంట్​కార్పొరేషన్)​చైర్ పర్సన్ గ్రామీణ ప్రాంతాలలో సౌరశక్తి్ వినియోగాన్ని ఎలా వేగవంతం చేయాలన్నదానిపై తన అనుభవాన్ని పంచుకున్నా రు.

అలాగే, గ్రామీణ వేదికలపై మౌలిక సదుపాయాల పెంపు, కమ్యూనిటీ భాగస్వామ్యం, ప్రభుత్వ పథకాల సమర్థ వినియోగం వంటి అంశాలపై దిశానిర్దే్దేశం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ బీర్ల ఐల్లయ్య, ఎంపీలు, ఎమ్మెల్యేలు పి.బలరాం నాయక్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, డా. మల్లు రవి, రఘు రామ్ రెడ్డి, ఎమ్మెల్యేలు గోపి కృష్ణా లాంకిరెడ్డి, మందుల శామ్యూల్, కుచుకుళ్ళ రాజేష్ రెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కే సత్యనారాయణ, మేఘ రెడ్డి , జారే ఆదినారాయణ , వేముల వీరేశం, ఎమ్మెల్సీ వెంకట బల్మూర్ హాజరయ్యారు.

Next Story