Supreme Court: పీజీ సీట్లలో స్థానిక కోటా.. హైకోర్టు తీర్పుపై తెలంగాణ సర్కార్ సుప్రీంలో సవాల్

by Prasad Jukanti |

పీజీ మెడికల్ సీట్లలో స్థానిక కోటాపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Supreme Court:  పీజీ సీట్లలో స్థానిక కోటా.. హైకోర్టు తీర్పుపై తెలంగాణ సర్కార్ సుప్రీంలో సవాల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పీజీ మెడికల్ సీట్ల (PG Medical Seats) లో స్థానికత కోటా చెల్లదంటూ హైకోర్టు (High Court) ఇచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు (Supreme Court)లో సవాల్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను ఇవాళ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం పూర్తిస్థాయి విచారణకు అనుమతించింది. విచారణ సందర్భంగా పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటా (Local Quota) చెల్లదంటూ ఇటీవల జస్టిస్ సుధాంశు దులియా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ప్రస్తావించింది. త్రిసభ్య ధర్మాసనం తీర్పును దృష్టిలో ఉంచుకుని తమ పిటిషన్ ను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని కోరింది. తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తిని విన్న కోర్టు విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలంటే ముందు తాము విచారణ చేపడతామని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 4వ తేదీకి వాయిదా వేసింది.

Next Story