- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
ఉపాధ్యాయ కొలువే లక్ష్యంగా ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

దిశ, వెబ్‌డెస్క్: ఉపాధ్యాయ కొలువే లక్ష్యంగా ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET) ఫలితాలను విడుదల చేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. సరిగ్గా మధ్యాహ్నం 2:30 గంటలకు టెట్ ఫలితాల లింక్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టింది. ఈ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,53,752 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 1,15,028 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులు (Inservice Teachers) 23,623 మంది, ఇతర అభ్యర్థులు 91,405 మంది ఉన్నారు. వీరిలో మొత్తం మీద 50,544 మంది (43.94%) అభ్యర్థులు అర్హత (Qualified) సాధించారు. ఫలితాల కోసం ఈ లింక్‌ను https://tgtet.aptonline.in క్లిక్ చేయండి.
కమ్యూనిటీల వారీగా అర్హత సాధించిన శాతం..
BC అభ్యర్థులు: 40.36%
ST అభ్యర్థులు: 51.03%
(EWS): 22.43%
జనరల్ అభ్యర్థులు: 20.15%
ఈ పరీక్షల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువ సంఖ్యలో అర్హత సాధించి పైచేయి సాధించారు. పేపర్-1 పరీక్ష రాసిన నలుగురు ట్రాన్స్ జెండర్లలో ఇద్దరు అర్హత సాధించారు. పేపర్-II (మ్యాథ్స్)లో 32,555 మంది మహిళలు హాజరుకాగా 12,495 మంది, 11,567 మంది పురుషులు హాజరుకాగా 5,488 మంది అర్హత సాధించారు. ఆరుగురు ట్రాన్స్ జెండర్లలో నలుగురు క్వాలిఫై అయ్యారు. పేపర్-II (సోషల్)లో 23,008 మంది మహిళలు హాజరుకాగా 5,009 మంది అర్హత సాధించారు.






