తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల

by Gantepaka Srikanth |

తెలంగాణలో టెట్ నోటిఫికేషన్(TET Notification) విడుదలైంది.

తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో టెట్ నోటిఫికేషన్(TET Notification) విడుదలైంది. ఈనెల 15వ తేదీ నుంచి 29వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరి 3వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కాగా, 2025 సంవత్సరానికి సంబంధించి తొలి విడత టెట్ నోటిఫికేషన్‌ ఈ ఏడాది జూన్‌లో జారీ చేశారు. ఇప్పటికే పరీక్షలు పూర్తి చేయగా.. జులై 22న ఫలితాలు కూడా వెల్లడించారు. తాజాగా రెండో విడత నోటిఫికేషన్ ఇవాళ విడుదల చేశారు. మరోవైపు ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు కూడా టెట్‌లో అర్హత సాధించాలని సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వారంతా తమ ఉద్యోగాల్లో కొనసాగాలంటే టెట్‌ పాస్‌ కావాల్సి ఉంది.

Next Story