- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. డీఆర్వోలుగా 12 మంది తహసీల్దార్లు బదిలీ
తెలంగాణ రెవెన్యూ డిపార్ట్‌మెంట్ భారీ కుదుపు చోటుచేసుకుంది. ఏకంగా 12 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రెవెన్యూ శాఖలో పరిపాలనా విభాగానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున తహసీల్దార్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ఏకంగా 12 మంది తహసీల్దార్లను బదిలీ (Tahsildar Transfers) చేస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్ఏ (CCLA) కమిషనర్ అధికారికంగా ఆదేశాలు ఇచ్చారు. పరిపాలనా సౌలభ్యం కోసమే ఈ బదిలీలు చేపట్టినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, బదిలీ అయిన తహసీల్దార్లు అందరూ కూడా ఎలాంటి ఆలస్యం చేయకుండా, వెంటనే తమకు కేటాయించిన కొత్త ప్రాంతాలలో విధుల్లో చేరి (Report to Duty) ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని సీసీఎల్ఏ కమిషనర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల ఏసీబీ తనిఖీల్లో తహసీల్దార్లు పట్టుబడిన వేళ.. ఈ బదిలీల ప్రక్రియ రెవెన్యూ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.
ఈ బదిలీల్లో భాగంగా మోతీరామ్.ఎ (నిర్మల్ నుంచి మంచిర్యాల), బి. రాజేశ్వరి (కరీంనగర్ నుంచి పెద్దపల్లి), కె.వై. ప్రసాద్ (పెద్దపల్లి నుంచి జగిత్యాల), ఆర్. పాండు (వనపర్తి నుంచి నాగర్‌కర్నూల్), వి. రవి కుమార్ (ఖమ్మం నుంచి ములుగు), జె. స్వామి (మేడ్చల్-మల్కాజ్‌గిరి నుంచి కరీంనగర్), ఎ.పాండు (నాగర్‌కర్నూల్ నుంచి కామారెడ్డి) లు డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్లుగా (DRO) నియమితులయ్యారు. అలాగే చ. శ్రీకాంత్ జనగామ నుంచి మహబూబ్‌నగర్ ప్రత్యేక కలెక్టర్ కార్యాలయ పీఏ (PA) గా బదిలీ అవ్వగా.. ఎమ్.సుదర్శన్ రెడ్డి (సూర్యాపేట నుంచి సిద్దిపేట SDC, LA, Unit-II), ఎమ్.రమాదేవి (ఖమ్మం నుంచి నల్గొండ SDC, LA, Unit-II), జి. కుమారస్వామి (పెద్దపల్లి నుంచి సిరిసిల్ల SDC, LA), ఎన్.వెంకట్ రెడ్డిలను కరీంనగర్ SDC, LA గా బదిలీ చేశారు.






