- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అట్టహాసంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం.. అమరవీరుల స్థూపం వద్ద సీఎం రేవంత్ నివాళి
State Formation Day.. CM Revanth pays tribute at the Martyrs' Stupa

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రభుత్వం అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తోంది. ఈ మేరకు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హైదరాబాద్‌లోని అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్ (Gun Park)కు వెళ్లారు. అనంతరం అక్కడ అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తదితరులు పాల్గొన్నారు. అనంతరం సీఎం నేరుగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుగుతోన్న పరేడ్ గ్రౌండ్స్ (Parade Grounds)కు వెళ్లారు. అక్కడ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలను ప్రత్యేక అతిథులుగా జపాన్ (Japan) బృందం హాజరైంది. పరేడ్ గ్రౌండ్స్‌లో పోలీసు కవాతు అనంతరం ఉత్తమ సేవలందించిన పోలీసు సిబ్బందికి సీఎం రేవంత్ రెడ్డి మెడల్స్ అందజేయనున్నారు. ఆ తరువాత ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
రాష్ట్ర ఆర్థిక వృద్ధికి కట్టుబడి ఉన్నాం.. సీఎం రేవంత్
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) శుభాకాంక్షలు తెలిపారు. పత్యేక రాష్ట్ర సాధనలో అమరులైన వారి త్యాగాలను స్మరించుకున్నారు. ‘తెలంగాణను ప్రజలు కలిసికట్టుగా పోరాడి సాధించుకున్నారు. 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ వసంతంలోకి అడుగుపెట్టాం. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రైజింగ్ (Telangana Rising) నినాదాన్ని ఇచ్చాం. రాష్ట్ర ఆర్థిక వృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. రాష్ట్రం అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచేలా భవిష్యత్తు ప్రణాళికలు తీర్చిదిద్దుతున్నామని అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.






