ముంబై ఫైర్ బ్రిగేడ్‌లో తెలంగాణ డీజీ విక్రమ్ సింగ్ మాన్ పరిశీలన.. సాంకేతిక సదుపాయాలపై దృష్టి

by Ramesh Naini |

తెలంగాణ రాష్ట్ర ఫైర్ సర్వీసెస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ ముంబై ఫైర్ ఫైర్‌ బ్రిగేడ్‌ను సందర్శించారు.

ముంబై ఫైర్ బ్రిగేడ్‌లో తెలంగాణ డీజీ విక్రమ్ సింగ్ మాన్ పరిశీలన.. సాంకేతిక సదుపాయాలపై దృష్టి
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ఫైర్ సర్వీసెస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ (DG Vikram Singh Mann) ముంబై ఫైర్ ఫైర్‌ బ్రిగేడ్‌(Mumbai Fire Brigade)ను సందర్శించారు. రాష్ట్ర అగ్నిమాపక శాఖ సామర్థ్యాలను మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ సందర్శనకు హాజరైనట్లు ఆయన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్శనలో అక్కడి ఆపరేషనల్‌ విధానం, సాంకేతిక సదుపాయాలు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్వోపిఎస్) వంటి అంశాలను సమీక్షించినట్లు తెలిపారు. ముంబై ఫైర్‌ బ్రిగేడ్‌లో అమలులో ఉన్న ఆధునిక విధానాలను పరిశీలించి, రాష్ట్ర అగ్నిమాపక వ్యవస్థలో వాటిని అన్వయించుకునే అవకాశాలను గుర్తించినట్లు పేర్కోన్నారు. కంట్రోల్‌ రూమ్‌ మౌలిక సదుపాయాల బలోపేతం, ఆధునిక ఫైర్‌ రెస్పాన్స్‌ వాహనాల సమన్వయం పై సమీక్షించినట్లు తెలిపారు.

Next Story