తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై రేపే స్పీకర్ కీలక తీర్పు!

by Gantepaka Srikanth |

తెలంగాణ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా సాగుతున్న ఉత్కంఠకు రేపటితో తెరపడనుంది.

తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై రేపే స్పీకర్ కీలక తీర్పు!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా సాగుతున్న ఉత్కంఠకు రేపటితో తెరపడనుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై శాసనసభ స్పీకర్ రేపు తన తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో, నిర్ణీత గడువు ముగుస్తుండటంతో స్పీకర్ కార్యాలయం ఈ మేరకు సిద్ధమైంది. మొత్తం పదిమంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించగా, ఇప్పటికే ఎనిమిది మందికి స్పీకర్ క్లీన్‌చిట్ ఇచ్చారు. దానం, కడియంలపై తాజాగా వాదనలు పూర్తయ్యాయి. సుప్రీంకోర్టు సూచనల ప్రకారం మార్చి 12వ తేదీలోపు వీరిద్దరి విషయంలో స్పీకర్ నిర్ణయాన్ని ప్రకటించాలి. దీంతో రేపు స్పీకర్ తీర్పు ఎలా ఉండబోతుందో అని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. రేపు వెలువడే తీర్పు ఈ ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనుంది. అనర్హత వేటు పడితే? ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. ఈ నిర్ణయం రాష్ట్రంలోని ఇతర పార్టీ ఫిరాయింపుదారులపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉండటంతో అందరి దృష్టి స్పీకర్ తీర్పుపైనే పడింది.




Next Story