- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుత్ వినియోగంలో తెలంగాణ ఆల్‌టైమ్ రికార్డు
రాష్ట్రంలో విద్యుత్ వినియోగం చరిత్రలో కొత్త రికార్డు నమోదైంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో విద్యుత్ వినియోగం చరిత్రలో కొత్త రికార్డు నమోదైంది. ఈ నెల 13న ఒక్కరోజే రాష్ట్రంలో 341.08 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేయడంతో విద్యుత్ సంస్థలు ఆల్‌టైమ్ రికార్డు సృష్టించాయి. అదే రోజు ఉదయం 11:17 గంటలకు 18,228 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్‌ను కూడా విజయవంతంగా తట్టుకుని సరఫరా కొనసాగించాయి. ఇది రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక విద్యుత్ వినియోగంగా నిలిచింది. గతంలో 2025 మార్చి 18న నమోదైన 335.19 మిలియన్ యూనిట్ల రికార్డును ఈసారి అధిగమించింది. అలాగే 2025 మార్చి 20న నమోదైన 17,162 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌ను కూడా ఈసారి మించిపోయింది.
అధిక ఉష్ణోగ్రతలు, వ్యవసాయ అవసరాలు పెరగడంతో...
ఉష్ణోగ్రతలు పెరగడం, వ్యవసాయ అవసరాలు అధికమవడం వల్ల విద్యుత్ వినియోగం, గరిష్ట లోడ్ రెండూ పెరిగినట్లు అధికారులు తెలిపారు. అయినప్పటికీ రాష్ట్ర విద్యుత్ సంస్థలు సమర్థవంతమైన నిర్వహణతో డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా కొనసాగించాయి. భవిష్యత్తులో విద్యుత్ అవసరాలు మరింత పెరిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర విద్యుత్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రోజుకు 350 మిలియన్ యూనిట్లకు పైగా వినియోగం, సుమారు 19 వేల మెగావాట్ల గరిష్ట లోడ్‌ను కూడా నిర్వహించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని వెల్లడించారు. అధిక డిమాండ్ సమయంలోనూ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా కొనసాగించినందుకు రాష్ట్రంలోని అన్ని విద్యుత్ సంస్థల సిబ్బందిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రత్యేకంగా అభినందించారు.






