- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: తల్లిదండ్రులకు అలర్ట్.. గుర్తింపు పొందిన పాఠశాలల జాబితా విడుదల
తెలంగాణలో 2026-27 విద్యాసంవత్సరానికి గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల జాబితాను విద్యాశాఖ విడుదల చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు మొదలయ్యాయి. విద్యార్థులను చేర్పించేందుకు ఇటు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఫోకస్ పెట్టాయి. ఇక తల్లిదండ్రులు సైతం తమకు అనుకూలమైన ప్రాంతాల్లో, నాణ్యమైన విద్యను అందించే బడుల్లో తమ పిల్లలను చేర్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఏ పాఠశాల ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకుంది? ఏ సంస్థ అనుమతులు లేకుండా నడుపుతోంది? అనేది తల్లిదండ్రులకు సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఈ మేరకు రాష్ట్రంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల జాబితాను పాఠశాల విద్యాశాఖ తాజాగా తమ వెబ్‌సైట్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. రాష్ట్ర బోర్డుతో పాటు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ, ఇతర బోర్డులకు అనుబంధంగా ఉన్న పాఠశాలల వివరాలను జిల్లా, మండలాల వారీగా అందుబాటులో ఉంచింది.
ఎలా చెక్ చేసుకోవాలి:
ముందుగా పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన వెబ్‍సైట్ www.schooledu.telangana.gov.in ను సెర్చ్ చేసి అక్కడ ‘క్లిక్ హియర్ ఫర్ లిస్ట్ ఆఫ్ రికగ్నైజ్డ్ ప్రైవేట్ స్కూల్స్ ఇన్ ద స్టేట్’ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. అక్కడ జిల్లా, మండలం ఆప్షన్స్ ఎంచుకోగానే పాఠశాల పేరు, దాన్ని నెలకొల్పిన సంవత్సరం, ఏ బోర్డు సిలబస్, చిరునామా వంటి వివరాలు కనిపిస్తాయి. అయితే ఆ పాఠశాలలకు ఎప్పటి వరకు గుర్తింపు ఉంది వంటి తదితర వివరాలు కూడా త్వరలో వెల్లడిస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాక తమ పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని అధికారులు సూచిస్తున్నారు.






