- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rythu Commission: మా లక్ష్యమే కాదు.. సీఎం రేవంత్ టార్గెట్ కూడా అదే
రాష్ట్ర ప్రభుత్వానికి రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అనుభవం ఎంతగానో ఉపయోగకరంగా ఉందని, రైతులకు భరోసాగా నిలిచిందని కమిషన్సభ్యులు భవాని రెడ్డి, భూమి సునీల్ తెలిపారు. తొందరలోనే విత్తన చట్టం ఆమోదించేలా చూస్తామని, రైతును రాజు చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా పనిచేస్తామన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వానికి రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అనుభవం ఎంతగానో ఉపయోగకరంగా ఉందని, రైతులకు భరోసాగా నిలిచిందని కమిషన్సభ్యులు భవాని రెడ్డి, భూమి సునీల్ తెలిపారు. తొందరలోనే విత్తన చట్టం ఆమోదించేలా చూస్తామని, రైతును రాజు చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా పనిచేస్తామన్నారు. బుధవారం కమిషన్‌ఏర్పాటు చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా కమిషన్కార్యాలయంలో ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలు, పర్యటనలు, ప్రభుత్వానికి ఇచ్చిన సూచనలపై కమిషన్ చైర్మన్, సభ్యులు సమీక్ష చేశారు. అనంతరం చైర్మన్కోదండరెడ్డిని ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా కోదండరెడ్డి మాట్లాడుతూ.. ఏడాది కాలంలో చేపట్టిన అనేక కార్యక్రమాలు రైతులకు మేలుచేశాయని గుర్తుచేశారు. రానున్న ఏడాదిలో కూడా రైతు కమిషన్ ఇదే పంథాలో ముందుకు సాగుతుందని తెలిపారు. రైతు బిడ్డ రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్నపుడే కమిషన్ వేస్తామని చెప్పి ఆ హామీ మేరకు కమిషన్ వేశారని, ఏర్పాటు చేశాక తాము రైతులకు సంబంధించిన అన్ని అంశాల మీద దృష్టి పెట్టామన్నారు. వరంగల్ ఏనుమాముల మార్కెట్, నల్గొండ బత్తాయి మార్కెట్, నిజామాబాద్ పసుపు మార్కెట్ విజిట్ చేసి అక్కడి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు. ములుగు జిల్లాలో రైతులు నకిలీ విత్తనాలతో నష్టపోతే రూ.4 కోట్ల పరిహారం ఇప్పించ్చామని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం అన్ని రంగాలను నిర్వీర్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంటిమెంట్‌తో 10 ఏళ్లు అధికారంలో ఉన్నా ఒక్క రైతుబంధు ఇచ్చి మిగిన అన్నిటిని గాలికి వదిలేసిందన్నారు. ఈ సమావేశంలో సభ్యులు గడుగు గంగాధర్, గోపాల్ రెడ్డి, చెవిటి వెంకన్న యాదవ్‌పాల్గొన్నారు.






