- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేటి నుంచే తెలంగాణ రైతుల ఖాతాల్లో డబ్బులు..!
తెలంగాణ రాష్ట్ర రైతులకు ( Farmers) అదిరిపోయే శుభవార్త అందింది. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో... పెట్టుబడి

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర రైతులకు ( Farmers) అదిరిపోయే శుభవార్త అందింది. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో... పెట్టుబడి సహాయాన్ని అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ( Telangana Government) సిద్ధమైంది. రైతు భరోసా (Rythu Bharosa) కింద పెట్టుబడి సహాయాన్ని... తెలంగాణ రైతన్నలకు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది రేవంత్ రెడ్డి ( Revanth Reddy)ప్రభుత్వం. ఈ రైతు భరోసా నిధులు జమ చేసే కార్యక్రమాన్ని ఇవ్వాల్టి నుంచి ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది.
వర్షాకాలం సాగు ప్రారంభమవుతున్న నేపథ్యంలో... రైతు భరోసా నిధులను విడుదల చేయబోతున్నట్లు కూడా నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ప్రకటన చేశారు. సోమవారం నుంచి రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు పడతాయని ఆయన ప్రకటించారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో రైతు భరోసా నిధులు విడుదల చేయడంలో కాస్త ఆలస్యమైనప్పటికీ.. రైతులందరికీ న్యాయం చేస్తామని వెల్లడించారు. డబ్బులను ప్రతి రైతుకు అందేలా చేస్తామని వివరించారు.
కాగా రైతు భరోసా కింద ఏడాదికి రెండు విడతలలో 12 వేల రూపాయల చొప్పున.. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తోంది. ఇక మొన్నటి యాసంగి సమయంలో 3.5 ఎకరాల వరకే.. రైతు భరోసా విడుదల చేసిన ప్రభుత్వం ఇప్పుడు 10 ఎకరాల వరకు ఒకేసారి డబ్బులు జమ చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా అర్హత పొందిన రైతులకు నెలాఖరులో నిధులు.. విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. దింతో తెలంగాణ రైతులకు ఊరట లభించనుంది.






