- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కీలక పిలుపు
దేశవ్యాప్తంగా ఈనెల 9న జరిగే సార్వత్రిక సమ్మెలో ఆర్టీసీ కార్మికులంతా పాల్గొనాలని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ పిలుపునిచ్చింది.

దిశ, తెలంగాణ బ్యూరో : దేశవ్యాప్తంగా ఈనెల 9న జరిగే సార్వత్రిక సమ్మెలో ఆర్టీసీ కార్మికులంతా పాల్గొనాలని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ, కార్మిక వర్గ హక్కులను కాలరాసే నాలుగు లేబర్ కోడ్ ల రద్దు చేయాలని టీజీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్యూనియన్నేత ఈదురు వెంకన్న డిమాండ్చేశారు. ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ట్రేడ్ యూనియన్ పై ఆంక్షల ఎత్తివేత, అధిక పనిగంటలతో కార్మికుల శ్రమదోపిడి అరికట్టి, రాజ్యాంగబద్దంగా లేబర్ యాక్ట్ అమలు చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వ రవాణా రంగాలను ప్రైవేటు పరం చేయవద్దని, విద్యుత్ బస్సులను కార్పొరేట్సంస్దల ద్వారా కాకుండా ప్రభుత్వ సహకారంతో ఆర్టీసీ సంస్థలు కొనుగోలు చేసే విధంగా అనుమతులు ఇవ్వాలన్నారు. దేశవ్యాప్తంగా జరుగు సమ్మెలో ఆర్టీసీలో పని చేస్తున్న అన్ని కేటగిరీలకు చెందిన కార్మికులు, ఉద్యోగులు యూనియన్ విభేదాలు వీడి సమ్మెలో పాల్గొనాలని కోరారు.






