కాసేపట్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం.. శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

by Kema Shiva Kumar |

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 (Telangana Rising Global Summit-2025) వేళ దేశ, విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులను ఆకట్టుకునేలా హైదరాబాద్ (Hyderabad) నగరం సర్వాంగసుందరంగా ముస్తాబైంది.

కాసేపట్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం.. శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 (Telangana Rising Global Summit-2025) వేళ దేశ, విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులను ఆకట్టుకునేలా హైదరాబాద్ (Hyderabad) నగరం సర్వాంగసుందరంగా ముస్తాబైంది. అత్యాధునిక టెక్నాలజీ హంగులు.. తెలంగాణ ప్రత్యేక ఆకర్షణల మేళవింపుతో సమ్మిట్ కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. రంగారెడ్డి జిల్లా కందుకూరులోని ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల విస్తీర్ణంలో సోమ, మంగళవారాల్లో జరగనున్న ఈ సదస్సుకు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పేరుగాంచిన కంపెనీల నుంచి యాజమాన్య ప్రతినిధుల బృందాలు సమ్మిట్‌ భాగస్వాములు కాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం వేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి, పురోగతి, ఆవిష్కరణకు వేదిక కావాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.

Next Story