Bhatti Vikramarka: ఆ డాక్యుమెంట్ తెలంగాణకు భగవద్గీత: భట్టి

by Prasad Jukanti |   (  Updated:2025-06-02 11:03:23  IST  )

గడిచిన పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో రైతులు తీవ్ర అన్యాయానికి గురయ్యారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు.

Bhatti Vikramarka: ఆ డాక్యుమెంట్ తెలంగాణకు భగవద్గీత: భట్టి
X

దిశ, ఖమ్మం బ్యూరో/డైనమిక్ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రూపొందించిన తెలంగాణ రైజింగ్ -2047 (Rising Telangana-2047) విజన్ డాక్యుమెంట్ తెలంగాణకు ఒక భగవద్గీత అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. ఇది తెలంగాణ రూపురేఖలను మార్చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకల్లో భాగంగా ఖమ్మం (Khammam) జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో అమరవీరులకు భట్టి విక్రమార్క నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసువులు బాసిన అమర వీరులందరికీ నివాళులు అర్పిస్తున్నట్లు చెప్పారు.

గత పాలనలో తీవ్ర అన్యాయం:

గత పదేళ్ల బీఆర్ఎస్ (బీఆర్ఎస్) పాలనలో రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని భట్టి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన భూభారతితో అనేక మంది రైతులు తమ భూములు కోల్పోయారని విమర్శించారు. భూభారతి (Bhubharathi) చట్టాన్ని తీసుకువచ్చి రైతుసమస్యలకు చెక్ పెట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న నిరంతర అభివృద్ధి మూలంగా రాష్ట్రంలో గరిష్ట విద్యుత్తు డిమాండ్ ఏర్పడి ఈ ఏడాది కొత్త రికార్డులు సృష్టించిందని 2024 లో గరిష్ట విద్యుత్ డిమాండ్ 16, 877 మెగావాట్లు కాగా ఏడాది గరిష్ట వీటితో డిమాండ్ 17,162 మెగావాట్లకు చేరిందని చెప్పారు. 2030 నాటికి గరిష్ట విద్యుత్తు డిమాండ్ 24,215 మెగావాట్లకు చేరుతుందని అంచనా వేసుకున్నామని ఈ డిమాండ్ అందుకోవడానికి ఐదేళ్ల విద్యుత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు దీనికి అనుగుణంగానే నూతన సబ్ స్టేషన్లు లైన్లు వంటివి ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025న రూపొందించామన్నారు.

ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా 1000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ పవర్ ప్లాంట్ ను స్వయం సహాయక బృందాలచే ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. మొదటి విడతగా పైలెట్ ప్రాజెక్టుగా ప్రతి జిల్లాలో రెండు మెగావాట్ల సామర్థ్యం గల మొత్తం 64 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఇందిరా సౌర గిరిజల వికాసంలో భాగంగా ఏడాది పదివేల మంది రైతులకు చెందిన భూముల్లో సోలార్ ప్లేట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలంలో 42 వేల వ్యవసాయ కనెక్షన్లకు సోలార్ ప్లాంట్లు అమర్చనున్నామని తెలిపారు. ఖమ్మం నగరం చుట్టూ జాతీయ రహదారులు రానున్నాయి. ఇంద్రుడు నిర్మాణానికి చర్యలు చేపట్టారు. ఖమ్మం జిల్లాలో రిపోర్టు టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టినట్టు చెప్పారు.

Next Story