- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Delhi: ఇరాన్, ఇజ్రాయెల్ నుంచి ఢిల్లీకి చేరుకున్న తెలంగాణవాసులు.. సీఎం కీలక ఆదేశాలు
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్దం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న వారిని తిరిగి తెలంగాణ రప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ఇరాన్, ఇజ్రాయెల్ (Iran Israel War) యుద్దం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న వారిని తిరిగి తెలంగాణ రప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. నిన్న రాత్రి ఇజ్రాయెల్ నుంచి ఇద్దరు, ఇరాన్ నుంచి ఇవాళ ఉదయం నలుగురు తెలంగాణ వాసులు (Telangana residents) భారత్‌కు చేరుకున్నారు. ఈ రాత్రికి ఇంకా 7 గురు రావాల్సి ఉన్నట్లు ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులు పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌లో విమాన సర్వీసులు నిలిపివేయడంతో ఇంకా చాలామంది రావాల్సి ఉంది. దీనికోసం భారత విదేశాంగశాఖతో తెలంగాణ ప్రభుత్వం మంతనాలు జరుపుతోంది.
స్వదేశానికి వచ్చే ప్రతి తెలంగాణ నివాసికి సకాలంలో సహాయం, సరైన వసతి, తదుపరి ప్రయాణ సౌకర్యం అందేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పౌరులంతా అధికారిక మార్గాలనే అనుసరించాలని, ధృవీకరించని సమాచారంపై ఆధారపడరాదని సూచనలు జారీ అయ్యాయి. ఈ క్లిష్ట సమయంలో తెలంగాణ ప్రభుత్వం పౌరులకు అండగా నిలుస్తూ వారి భద్రతకు, త్వరితగతిన స్వదేశానికి రప్పించేందుకు ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది.






