- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వెజ్-నాన్ వెజ్ మార్కెట్లకు ఊపిరి.. పెండింగ్ పనులకు నిధుల విడుదల
మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని ప్రజలకు శాఖాహారం, మాంసాహారం రెండు ఒకేచోట లభించే విధంగా గత ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని ప్రజలకు శాఖాహారం, మాంసాహారం రెండు ఒకేచోట లభించే విధంగా గత ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 130 యూఎల్‌బీల్లో మున్సిపాలిటీల్లో రూ.1143.61 కోట్లతో మార్కెట్లను నిర్మించాలని నిర్ణయించారు. 2024-25 బడ్జెట్‌లో భాగంగా రెండుస్లార్లు రూ.76కోట్లు కేటాయించారు. పెండింగ్ పనులను పూర్తి చేయాలని మున్సిపల్ పరిపాలన శాఖ నిర్ణయించింది. అందులో భాగంగానే 2026-27 బడ్జెట్‌లో రూ.100కోట్లు కేటాయించడంతోపాటు ఇప్పటికే రూ.50 కోట్లు విడుదల చేయడానికి ప్రస్తుత ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
రూ.50 కోట్లు
వెజ్, నాన్ వెజ్ మార్కెట్లకు సంబంధించిన పనులను పూర్తి చేయడానికి మున్సిపల్ పరిపాలనశాఖ చర్యలు ప్రారంభించింది. 2026-27 బడ్జెట్ లో కేటాయించిన రూ.100 కోట్లలో భూపాలపల్లి మున్సిపాలిటీకి రూ.3.35 కోట్లు, కోస్గీ, నారాయణపేట్, మక్తల్ మున్సిపల్ మార్కెట్లకు రూ.3.93 కోట్లు, కొత్తపల్లి, చొప్పదండి మున్సిపల్ మార్కెట్లకు రూ.1.99 కోట్లు, హుజురాబాద్, జమ్మికుంట, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్ మున్సిపల్ మార్కెట్లకు రూ.13.66 కోట్లు విడుదల చేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. కాగా ఏప్రిల్ మాసంలో రూ.25 కోట్లతోపాటు మొత్తం రూ.50 కోట్లు విడుదల చేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పెండింగ్ బిల్లులను విడుదల చేయడానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.
133 మార్కెట్లు
రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలతోపాటు జీహెచ్ఎంసీలో విలీనమైన 27 యూఎల్‌బీలకు సంబంధించి మొత్తం 133 ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మున్సిపల్ మార్కెట్లు మంజూరయ్యాయి. వీటికిగాను 1143.61కోట్లు కేటాయించారు. ఇప్పటివరకు నారాయణపేట్‌లో రూ.10.50 కోట్లతో, జహీరాబాద్‌లో రూ.7.55కోట్లతో, సూర్యాపేటలో రూ.11.28 కోట్లతో నిర్మించిన మార్కెట్లను మాత్రమే వినియోగిస్తున్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మార్కెట్ 98శాతం, భువనగిరి మున్సిపాలిటీలో 92శాతం పనులు పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే ఆ పెండింగ్ పనులను సైతం పూర్తి చేయాలని మున్సిపల్ పరిపాలన శాఖ నిర్ణయించింది.






