Telangana rain update: కరుణించిన వానదేవుడు.. కానీ!

by Ajay Maddhiboyina |

తెలంగాణ‌లో గత కొద్దిరోజులుగా భారీ వ‌ర్షాలు కురుస్తున్న సంగ‌తి తెలిసిందే. భారీ వ‌ర్షాల‌కు రాష్ట్రంలోని వాగులు, వంక‌లు పొంగిపొర్లుతున్నాయి. చాలా ప్రాంతాల్లో భారీ వ‌ర్షాపాతం న‌మోద‌య్యింది.

Telangana rain update: కరుణించిన వానదేవుడు.. కానీ!
X

దిశ‌, వెబ్ డెస్క్: తెలంగాణ‌లో గత కొద్దిరోజులుగా భారీ వ‌ర్షాలు కురుస్తున్న సంగ‌తి తెలిసిందే. భారీ వ‌ర్షాల‌కు రాష్ట్రంలోని వాగులు, వంక‌లు పొంగిపొర్లుతున్నాయి. చాలా ప్రాంతాల్లో భారీ వ‌ర్షాపాతం న‌మోద‌య్యింది. ప్రాజెక్టుల్లో నీళ్లు నిండిపోవ‌డంతో గేట్లు తెరిచి కిందికి వ‌దిలేస్తున్నారు. ప్ర‌తిరోజు భారీ నుండి అతిభారీ వ‌ర్షాలు కుర‌వ‌డంతో ప్ర‌జ‌లు ఎంతో ఇబ్బంది ప‌డుతున్నారు.

అయితే ఈ రోజు మాత్రం వ‌ర్షం నుండి ఉప‌శ‌మ‌నం ఉంటుందని వెద‌ర్ మ్యాన్ ప్ర‌క‌టించారు. అల్పపీడనం తీరం దాడిపోవడంతో నేడు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం లేదన్నారు. సాయంత్రం వరకు వాతావరణం దాదాపు పొడిగానే ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో హైదరాబాద్ తో సహా ఇతర ప్రాంతాల్లో సాయంత్రం నుండి రాత్రి వరకు తేలికపాటి నుండి మధ్యస్థ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Next Story