తెలంగాణకు వర్షసూచన.. రాష్ట్రంలో మూడు రోజులపాటు వర్షాలు

by Ajay Maddhiboyina |

తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ బాలాజీ పేర్కొన్నారు. ఫిబ్రవరి 22 నుండి 24వ తేదీ వరకు రాష్ట్రంలో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

తెలంగాణకు వర్షసూచన.. రాష్ట్రంలో మూడు రోజులపాటు వర్షాలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ బాలాజీ పేర్కొన్నారు. ఫిబ్రవరి 22 నుండి 24వ తేదీ వరకు రాష్ట్రంలో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఫిబ్రవరి 22న సెంట్రల్, తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఫిబ్రవరి 23, 24 తేదీల్లో సెంట్రల్ తెలంగాణతో పాటు, తూర్పు, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

ఇక ఈ సమయంలో హైదరాబాద్ లోనూ పిడుగులతో కూడిన వర్షాలు కురురుస్తాయని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఉదయం వేళల్లో చలి వణికిస్తోంది. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఫిబ్రవరి వచ్చినా చలి పంజా విసురుతూనే ఉంది. మరోవైపు మద్యాహ్నం సమయాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఇక ఇప్పుడు మరో రెండు రోజుల్లో వర్షాలు ఉండటంతో రాష్ట్రంలో వాతావరణంలో మరిన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది.

Next Story