- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో మూడో రోజూ ప్రైవేట్ కాలేజీల బంద్
తెలంగాణలో మూడో రోజు కూడా ప్రైవేట్ కాలేజీల బంద్ కొనసాగుతోంది. ప్రభుత్వం ఫీజు రియంబర్స్ మెంట్ చెల్లించాలంటూ విద్యాసంస్థలు సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కాగా నేటితో ఆ సమ్మె మూడో రోజుకు చేరుకుంది. సెమిస్టర్ పరీక్షలను సైతం ఫార్మసీ కాలేజీలు బహిష్కరించాయి.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో మూడో రోజు కూడా ప్రైవేట్ కాలేజీల బంద్ కొనసాగుతోంది. ప్రభుత్వం ఫీజు రియంబర్స్ మెంట్ చెల్లించాలంటూ విద్యాసంస్థలు సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కాగా నేటితో ఆ సమ్మె మూడో రోజుకు చేరుకుంది. సెమిస్టర్ పరీక్షలను సైతం ఫార్మసీ కాలేజీలు బహిష్కరించాయి. మరోవైపు రీఎంబర్స్ మెంట్ సంస్కరణల కోసం ప్రభుత్వం ఓ కమిటీని వేసింది. ఆ కమిటీ కాలయాపన చేయవద్దని కాలేజీ యాజమాన్యాలు ఆందోళన చేస్తున్నాయి. 50శాతం బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం ఈ విషయంపై స్పందించే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశాయి. ఇదిలా ఉంటే సోమవారం నుండి కాలేజీలు బంద్ లో పాల్గొంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 2వేలకు పైగా ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు, పీజీ కాలేజీలు, డిగ్రీ కాలేజీలో బంద్ లో పాల్గొంటున్నాయి. దీంతో ప్రభుత్వం కాలయాపన చేస్తే విద్యార్థులు నష్టపోతారని వెంటనే బకాయిలు చెల్లించాలంటూ విద్యాసంఘాలు సైతం డిమాండ్ చేస్తున్నాయి.






