- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశంలోనే తెలంగాణ జైళ్ల శాఖ మూడో స్థానం: హోంమంత్రి మహమూద్ అలీ
by Satheesh |
రాష్ట్రంలో జైళ్ల శాఖ పని తీరుపై మంగళవారం హోం మంత్రి మహమూద్ అలీ కొత్త సచివాలయంలోని తన చాంబర్లో సమీక్ష జరిపారు.

X
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: రాష్ట్రంలో జైళ్ల శాఖ పని తీరుపై మంగళవారం హోం మంత్రి మహమూద్ అలీ కొత్త సచివాలయంలోని తన చాంబర్లో సమీక్ష జరిపారు. ముంబైకి చెందిన టీఐఎస్ఎస్ నిర్వహించిన సర్వేలో దేశంలోనే తెలంగాణ జైళ్ల శాఖ మూడో స్థానం సంపాదించటంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆయా జైళ్లలో ఏర్పాటు చేసిన పారిశ్రామిక యూనిట్ల పని తీరుపై అడిగి తెలుసుకున్నారు. ఖైదీల సంక్షేమం కోసం అమలు చేస్తున్న చర్యలపై చర్చించారు. శిక్షలు ముగించుకున్న ఖైదీలకు శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ పంపుల్లో ఉద్యోగాలు ఇవ్వటంపై హర్షం వ్యక్తం చేశారు.ఈ సమీక్షా సమావేశంలో హోం శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, ఐజీ రాజేష్ తోపాటు డీఐజీలు, సూపరిండెంట్లు పాల్గొన్నారు.
Next Story






