- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జైల్లో 17 మంది గర్భిణీలకు ప్రసవాలు.. ప్రభుత్వ పథకాలు అమలు : 2025 వార్షిక నివేదిక వెల్లడి
రాష్ట్ర జైళ్ల శాఖ ఖైదీల సంక్షేమం పునరావాసంపైనే కాకుండా విద్యా రంగంపై ప్రత్యేక దృష్టిసారించిందని తెలంగాణ జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా వెల్లడించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర జైళ్ల శాఖ ఖైదీల సంక్షేమం పునరావాసంపైనే కాకుండా విద్యా రంగంపై ప్రత్యేక దృష్టిసారించిందని తెలంగాణ జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా వెల్లడించారు. తెలంగాణ జైళ్ల శాఖ-2025 వార్షిక నివేదికను చంచల్ గూడ ప్రిజన్స్ అకాడమీలో సోమ వారం డీజీ సౌమ్య మిశ్రా విడుదల చేశారు. ఈ సం దర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముఖ్యంగా సైబర్ నేరాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో భారీ పెరుగుదల కనిపించిందని చెప్పారు. 2024లో 34,811 మంది ఖైదీలు ఉండగా.. 2025 నాటికి 42,566 మంది ఖైదీలు పెరిగారన్నారు. అండర్ ట్రయల్ అడ్మిషన్లు 36,627, 5856 మంది శిక్ష పడిన ఖైదీలు 81 శాతం, పోక్సో కేసులలో ఖైదీల సంఖ్య 4,176 ఉన్నట్లు వెల్లడించారు. సివిల్ కేసుల్లో 20 మంది ఖైదీలుగా జైళ్లకు వచ్చారని, సైబర్ నేరాలు అత్యధికంగా 135.6 శాతం పెరిగాయని పేర్కొన్నారు. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 152 శాతం పెరుగుదల కనిపించిందని అన్నారు. సైబర్ క్రైమ్ కేసులకు సంబంధించి 1,784 ఖైదీలు ఉన్నట్లు తెలిపారు. గతేడాదితో పోలిస్తే జైళ్లలో విదేశీయుల అడ్మిషన్ల సంఖ్య గణనీయంగా తగ్గిందని వెల్లడించారు. ఖైదీల్లో 18 నుంచి 30 ఏళ్లలోపు యువత సంఖ్య 19,413గా ఉందన్నారు. 301 మంది ఖైదీలు పెరోల్ మీద ఉన్నట్లు పేర్కొన్నారు.
అక్షరాస్యులుగా 23,220 మంది ఖైదీలు
విద్యా రంగంలోనూ జైళ్ల శాఖ కీలక అడుగులు వేసింది. ‘థంబ్ ఇన్ – సైన్ అవుట్’నినాదంతో 23,220 మంది ఖైదీలను అక్షరాస్యులుగా మా ర్చారు. చర్లపల్లి జైలు అధ్యయన కేంద్రాల ద్వారా అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2025లో 28 మంది ఖైదీలు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2025 లో 79 శాతం మంది కాన్విక్ట్ ఖైదీలకు వివిధ వృత్తు ల్లో శిక్షణ ఇచ్చామని సౌమ్య మిశ్రా తెలిపారు.
17 మంది గర్భిణీ ఖైదీలకు సురక్షిత ప్రసవం
జైలులో అడ్మిషన్ సమయంలో ప్రతి ఖైదీకి తప్పనిసరిగా వైద్య పరీక్షలు, ఆరోగ్య తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రుల్లో 17 మంది గర్భిణీ ఖైదీలకు సురక్షిత ప్రసవం జరిగినట్లు తెలిపారు. ఆనారోగ్యానికి గురైన ఖైదీలకు 379 శస్త్రచికిత్సలు జరిగినట్లు పేర్కొన్నారు. 2025లో తెలం గాణ జైళ్లలో మొత్తం 13 వైద్య శిబిరాలు నిర్వహిం చినట్లు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జైళ్ల శాఖ ఘనంగా నిర్వహించగా, 6,597 మంది ఖైదీలు, 910 మంది సిబ్బంది, అధికారులు పాల్గొన్నట్లు పేర్కొన్నారు. 70 ఏళ్లు పైబడిన 23 మంది ఖైదీలను ‘ఆయుష్మాన్ వయ వందన’ ఆరోగ్య పథకం కింద నమోదు చేసినట్లు తెలిపారు.






