Blood Donation: పోలీసులే కాదు.. వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా..

by Gantepaka Srikanth |   (  Updated:2025-07-11 10:56:40  IST  )

నిమ్స్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్(Telangana Police) 1వ బెటాలియన్ పోలీసులు యూసుఫ్‌గూడ క్యాంపస్‌లో భారీ రక్తదాన శిబిరం(Blood Donation Camp) నిర్వహించారు.

Blood Donation: పోలీసులే కాదు.. వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా..
X

దిశ, వెబ్‌డెస్క్: నిమ్స్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్(Telangana Police) 1వ బెటాలియన్ పోలీసులు యూసుఫ్‌గూడ క్యాంపస్‌లో భారీ రక్తదాన శిబిరం(Blood Donation Camp) నిర్వహించారు. బెటాలియన్ కమాండెంట్ మురళీకృష్ణ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ రక్తదాన కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ నరేంద్రసింగ్, మరియు ఆర్‌ఐ రాజేశ్, పోలీసు సిబ్బంది, మరియు పోలీసుల కుటుంబ సభ్యులు పాల్గొని రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలిచారు. ఈ రక్తదాన శిబిరానికి నిమ్స్ బ్లడ్ సెంటర్ అడిషనల్ ప్రొఫెసర్ డా.మురళీకృష్ణ, కోఆర్డినేటర్ జె. వెంకటరత్నం, బిడుగు శేఖర్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఎం.మల్లికార్జున, డా.రంజిత్, డా. కోమలీ మరియు ఇతర సహాయక సిబ్బంది హాజరయ్యారు. రక్తదాతలందరికీ నిమ్స్ బ్లడ్ సెంటర్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ‘రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి’ అనే నినాదంతో ఈ శిబిరం విజయవంతంగా ముగిసింది.

Next Story